Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ నటి జయచిత్ర ఇంట్లో చోరీ...ఫిర్యాదు

ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నైలోని నుంగంబాకం పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. నుంగంబాకం పోలిస్ స్టేషన్ పరిధిలోని మహలింగపురంలో నివాసం ఉండే జయచిత్ర, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు. విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలోపలే భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల రూపాయల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించడం లేదని ఈ నెల 24న గుర్తించారు. దీంతో వారు ఇంట్లోని సిబ్బంది, పూజారిని విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News